Maharashtra Politics : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించిన నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే ఆసక్తి తారస్థాయికి చేరుకుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ వర్గాల్లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మహాయుతి ఎమ్మెల్యేల భేటీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో ముగియనుండటంతో, కొత్త సర్కారు ఆ రోజుకు ముందు కొలువుదీరడం తప్పనిసరి.
Pushpa 2 Song : పుష్ప 2 ఐటెం సాంగ్ చూశారా..? శ్రీలీల అదరగొట్టేసిందిగా..
సభాప్రాంగణం వాంఖెడే స్టేడియంలో?
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మంగళవారం ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగే అవకాశముంది. ఆదివారం మూడు పార్టీల అగ్రనేతలు తమ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. మహాయుతి నేతలతో కలిసి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బావంకులే పేర్కొన్నారు.
కుల సమీకరణల ప్రభావం
మహారాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను సీఎం చేయాలనే ప్రతిపాదనకు మరాఠా వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న మరాఠాల సామాజిక వర్గానికి ఇప్పటివరకు 13 మంది ముఖ్యమంత్రులు చెందగా, బ్రాహ్మణుల జనాభా కేవలం 10 శాతమే. మరాఠా వర్గానికి చెందిన నేతనే ఈసారి ముఖ్యమంత్రిగా చూసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మహాయుతి నేతలు ఎవరి పేరు తుది నిర్ణయానికి వస్తారో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
IPL Auction Record: పంత్, అయ్యర్ లకు జాక్ పాట్.. ఐపీఎల్ వేలం విశేషాలీవే!