ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా(Mahakumbh Mela Stampede)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నేడు మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా లక్షలాది భక్తులు సంగమం వద్దకు చేరుకున్నారు. పుణ్యస్నానం చేయడానికి వచ్చిన భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గాయపడిన భక్తులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు, సహాయక బృందాలు వెంటనే చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చెపుతున్నారు.
Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యారంగ బలోపేతానికి కీలక చర్యలు – భట్టి విక్రమార్క
మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం అత్యంత పవిత్రంగా భావిస్తారు. కుంభమేళాలో భాగంగా ఈ రోజున నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా కోటిన్నర మంది వరకు ఘాట్ల వద్దకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా తరలిరావడంతో అధికార యంత్రాంగానికి అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కుంభమేళా వేళ భక్తుల కోసం విశేష భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రజల తాకిడి కారణంగా ఈ విషాదం జరిగింది. భక్తుల భద్రతకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.