Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో మళ్ళీ పూర్వవైభవం కనిపిస్తున్నది. గత కొంతకాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజకంగా కనిపించలేదు. అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరారు. త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరబోతున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో జూపల్లి చేరనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాల స్థాయిలో కాంగ్రెస్ లో భారీగా చేరికలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధ అమర్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరెందర్ రాజు, కౌన్సిలర్ రమాదేవి, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Telangana Congress: కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ నేతలు

New Web Story Copy 2023 07 31t012706.667