ప్రముఖ టీవీ సీరియల్ ‘మహాభారత్’లో భీముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోబ్తీ మృతి చెందారు. 74 ఏళ్ల ప్రవీణ్ రాత్రి డిల్లీ అశోక్‌విహార్‌లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 20 ఏళ్ల వయసులో ప్రవీణ్.. సరిహద్దు భద్రతా దళంలో చేరారు. అక్కడే ఆయన అథ్లెటిక్ నైపుణ్యాలను గుర్తించి అధికారులు ప్రోత్సహించారు. అలా డిస్కస్ త్రో, హ్యామర్ వంటి ఆటల్లో ఎన్నో అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు.
ఏషియన్ గేమ్స్‌లో 1966, 1970ల్లో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు సాధించారు. 1966లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజత పతకం గెలిచారు. 1988లో ప్రసారమైన ప్రముఖ టీవీ సీరియల్ ‘మహాభారత్’లో భీముడిగా నటించి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. దాదాపు 50కి పైగా చిత్రాల్లో సహాయనటుడిగా మెప్పించారు.