Magunta Srinivasulu Reddy: ఇవాళ టీడీపీలోకి ఎంపీ మాగుంట

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 10:58 AM IST

భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) ఈ రోజు మధ్యాహ్నం లోక్‌ సభ, ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. దీంతో ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే.. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారుపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు జంపింగ్‌ జపాంగ్‌ చేస్తున్నారు. ఈ పార్టీలో నుంచి పార్టీలోకి… ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. అయితే.. ఇప్పటికే బీజేపీ (BJP)- జనసేన (Janasena)తో పొత్తు పెట్టుకున్న టీడీపీ (TDP) అధిష్టానానికి పార్టీలోని కీలక నేతలను నుంచి అసమ్మతి సెగలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. కొందరు టికెట్‌ రాలేదని నిరాశతో పక్కా పార్టీల వైపుకు చూస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy) సైకిలెక్కనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాగుంట కుమారుడు రాఘవ రెడ్డి (Raghava Reddy)కి టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీ టికెట్ ఖరారైనట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

గౌరవం లేని వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) పార్టీలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొంటూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలులో గతంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ అనివార్య పరిస్థితుల్లో తాను వైఎస్సార్‌సీపీని వీడాల్సి వచ్చిందన్నారు. “ఇది విచారకరమైన పరిణామం, కానీ నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడలేను” అని ఆయన అన్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మాగుంట కుటుంబం ఒక బ్రాండ్ అని, అన్నింటికంటే ఆత్మగౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ అన్నారు. “మాకు అహం లేదు, కానీ ఆత్మగౌరవం ఉంది మరియు మన ఆత్మగౌరవానికి విలువ లేని చోట మేము కొనసాగలేము” అని అతను చెప్పాడు. తన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేస్తానని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also : Banks For 5 Days: బ్యాంకు ఉద్యోగుల‌కు భారీ షాక్‌.. 5 రోజుల ప‌ని దినాల వార్త‌లపై ఆర్థిక మంత్రి క్లారిటీ..!