Delhi Liquor Scam : ఢిల్లీ మ‌ద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘ‌వ‌కు బెయిల్ మంజూరు

  • Written By:
  • Updated On - July 18, 2023 / 01:51 PM IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జైలులో ఉన్న మాగుంట రాఘవ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో రాఘవకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరైంది. గతంలో రాఘవ బెయిల్ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ ఈసారి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో హైకోర్టు రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో అధికారులకు సహకరించాలని, ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. చెన్నై నగరానికే పరిమితం కావాలని, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, దేశం బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4 గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని పేర్కొంది.