Site icon HashtagU Telugu

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు..!

Chile Earthquake

Chile Earthquake

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ ప్రకారం.. హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత వారం కూడా హెరాత్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. హెరాత్ నగరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. భూకంప కేంద్రం 6.3 కిలోమీటర్ల లోతులో ఉంది. USGS తన నివేదికలో తాజా భూకంపం కేంద్రం ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ మూడవ అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.

Also Read: Samruddhi Highway Accident:’సమృద్ధి’లో ఘోర ప్రమాదానికి, 12 మంది మృతి

We’re now on WhatsApp. Click to Join.

ఆఫ్ఘనిస్తాన్‌లో పదే పదే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి?

ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాల బారిన పడుతోంది. ఈ ప్రాంతం యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ దగ్గర ఉంది. గతంలో సంభవించిన భూకంపాలలో మరణించిన వారిలో 90 శాతానికి పైగా మహిళలు, పిల్లలేనని యునిసెఫ్ తెలిపింది.