Earthquake In Manipur: శనివారం (మే 20) రాత్రి 7.31 గంటలకు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లోని షిరుయ్‌లో 3.2 తీవ్రతతో భూకంపం (Earthquake) వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం మణిపూర్ (Earthquake In Manipur)లోని షిరుయ్ కి వాయువ్యంగా 3 కిమీ దూరంలో 31 కిమీ లోతులో ఉంది. గత నెల ఏప్రిల్ 16వ తేదీన కూడా ఈ రాష్ట్రంలో భూకంపం సంభవించింది.
సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం 7.31 గంటలకు భూకంపం సంభవించింది. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఖాళీ స్థలాలకు వెళ్లారు. అయితే భూకంప తీవ్రత తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పర్వతాలతో కూడిన ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాం, మిజోరాం, మణిపూర్‌లలో వరుసగా భూకంపాలు రావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. భూకంప శాస్త్రవేత్తలు ఈశాన్య భారత ప్రాంతాన్ని ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే ఆరవ ప్రాంతంగా పరిగణిస్తున్నారు.
Also Read: Gold Rates: పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన ధరలు.. నేడు తులం ఎంత పెరిగిందంటే..?
ఏప్రిల్ 16న భూకంపం
ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. దక్షిణ మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉదయం ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే, ఈ సమయంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు.
భూకంపాలు ఎందుకు వస్తాయి..?
భూమి లోపల అకస్మిక కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపం అనేది భూమి క్రస్ట్‌లో అకస్మాత్తుగా విడుదలయ్యే స్ట్రెయిన్ ఎనర్జీ (ఒత్తిడి శక్తి). దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్ లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. రాతి పొర వాటిని పైకి రానీయకుండా చేస్తుంది. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది.
భూకంపాలు రావడానికి మానవ తప్పిదాలు కూడా ఒక కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం, భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం. అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వాటి వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.