TN: జైలులో ఖైదీల ఘర్షణ-ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

తమిళనాడులోని మదురై సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. జైలు భవనం పైకి ఎక్కి రక్తం మొఖాలతో రాళ్లతో కొట్టుకుంటున్న ఖైదీలు ఎక్కడ రోడ్ల పైకి వచ్చి సాధారణ పౌరుల పై పడతారనే భయంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మొత్తం ఈ జైలు లో 13 వందల ఖైదీలు ఉన్నట్టు అధికారులు […]

Published By: HashtagU Telugu Desk
Template 2021 12 30t161708

Template 2021 12 30t161708

తమిళనాడులోని మదురై సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. జైలు భవనం పైకి ఎక్కి రక్తం మొఖాలతో రాళ్లతో కొట్టుకుంటున్న ఖైదీలు ఎక్కడ రోడ్ల పైకి వచ్చి సాధారణ పౌరుల పై పడతారనే భయంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మొత్తం ఈ జైలు లో 13 వందల ఖైదీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఇటీవలే ట్రిచీ నుండి కొంతమంది ఖైదీలను మధురై సెంట్రల్ జైలుకు తరలించగా.. మధురై జైలులో ఉన్న గ్రూపు, ట్రిచి నుండి వచ్చిన గ్రూపు మధ్య ఘర్షణ జరిగినట్టు జైలు అధికారులు తెలిపారు. ఈ సెంట్రల్ జైలు లో తరచు ఇలాంటిఘర్షణలు జరుగుతుంటాయి. 2019 లో కూడా ఇలానే గొడవలు జరిగి బాటిల్ లతో రాళ్లతో కొట్టుకున్నారు.

ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జైలు సూపరిండెంట్ సెల్వం మీడియాతో చెప్పుకొచ్చారు.

  Last Updated: 30 Dec 2021, 04:53 PM IST