Brave Mother: కన్న బిడ్డ కోసం ఏకంగా పులితో పోరాడిన మహిళ.. వైరల్ వీడియో?

సాధారణంగా కన్నతల్లి తన బిడ్డకు ఏమైనా అయితే తట్టుకోలేదు. తన బిడ్డకు ఎవరి నుంచి అయినా కానీ దేని నుంచి

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 05:45 PM IST

సాధారణంగా కన్నతల్లి తన బిడ్డకు ఏమైనా అయితే తట్టుకోలేదు. తన బిడ్డకు ఎవరి నుంచి అయినా కానీ దేని నుంచి అయినా ప్రాణహాని ఉంది అంటే చాలు తన ప్రాణాలు తెగించి మరీ వాటి నుంచి కాపాడుకుంటూ ఉంటుంది. తాజాగా కూడా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక మహిళ తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఏకంగా పులితో పోరాడింది. తన ప్రాణాలకు తెగించి మరి నోట్లో నుంచి బిడ్డను విడిపించుకుంది. వినడానికి భయంకరంగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లా టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని రోహనియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల అర్చన చౌదరి అనే ఒక మహిళ పులితో పోరాడి తన బిడ్డను రక్షించుకుంది.

తాజాగా ఆమె ఆదివారం ఉదయం పొలానికి తీసుకెళ్లిన తన 15 నెలల కొడుకును పులి నోట కరుచుకొని వెళ్లడం చూసి ఆమె చూసింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రమాదకరం అని తెలిసినా కూడా పులికి ఎదురు వెల్లింది. తన బిడ్డను రక్షించుకోవడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి మరి పులితో పోరాడింది. ఈ నేపథ్యంలోనే పులి ఆమె పై దాడి చేసింది. అయినా కూడా పులి నోట్లో నుంచి కొడుకును విడిపించే ప్రయత్నం చేస్తూ ప్పుడు ఆమె గట్టిగా అరవడంతో పక్క పొలాల్లో ఉన్న స్థానికులు అక్కడకు చేరుకొని పులిని తరిమేశారు. స్థానికులను చూసిన ఆ పులి బిత్తర పోయి ఆ చిన్నారిని అక్కడ వదిలేసి అడవిలోకి పారిపోయింది.

ఆ పులితో పోరాడిన మహిళ మాత్రం తీవ్ర గాయాల పాలయ్యింది. పులి దాడిలో ఆర్చన నడుము, చేయి, వెన్నుకు గాయాలయ్యాయని ఆమె భర్త భోళా ప్రసాద్ తెలిపాడు. కొడుకు రవిరాజ్ కు తల, వీపుపై గాయాలయ్యాయని చెప్పాడు. తల్లీకొడుకులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు దాడి చేసిన పులిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది ఏమైనా పనికి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ మహిళ ఒక ఆడ శివంగిలా ఆ పులితో పోరాడి గెలిచింది.