Peeing Incident: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన బీజేపీ నేత: వైరల్ వీడియో

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక గిరిజన బాలుడి మీద మూత్రం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు

Peeing Incident: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఒక గిరిజన వ్యక్తిపై మూత్రం పోస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో కాంగ్రెస్ బీజేపీపై మండిపడుతుంది. రాహుల్ గాంధీ కూడా ఈ అమానుష ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీని ఎండగట్టారు.

గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి బీజేపీ పార్టీకి చెందిన వాడిగా ఆరోపిస్తుంది కాంగ్రెస్. గిరిజన బాలుడిపై మూత్ర విసర్జన చేసిన ఈ వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని సిద్ధి బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి ప్రవేశ్ శుక్లాగా కాంగ్రెస్ ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో పర్వేష్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేశాడు. తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టిలో పడడంతో నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో తాజాగా నిందితుడు పర్వేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. సిగ్గుచేటంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలనలో గిరిజనుల బతుకు భారంగా మారిందని, సభ్య సమాజం తల దించుకునేలా ఉందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Read More: Nail Shape Personality Test: అదేంటి.. గోళ్ళ ఆకారాన్ని బట్టి ఎలాంటి వారో తెలుసుకోవచ్చా?