Wifes Body In Freezer : అతడు తన భార్య డెడ్ బాడీని ఇంట్లో మార్చురీ ఫ్రీజర్‌లో ఉంచాడు..
ఆ తర్వాత అందరికీ కాల్ చేసి .. ఆమె కామెర్లతో చనిపోయిందని చెప్పాడు.
ఆమె శుక్రవారం (జూన్ 30) చనిపోయిందని.. అంత్యక్రియల కోసం ముంబై నుంచి తన కొడుకు రావాల్సి ఉన్నందున మార్చురీ ఫ్రీజర్‌లో భార్య డెడ్ బాడీని ఉంచానన్నాడు. అయితే అతడు చెప్పిన మాటలను చనిపోయిన మహిళ సోదరుడు నమ్మలేదు. సందేహంగా ఉందని పోలీసులకు కంప్లయింట్ చేశాడు. దీంతో పోలీసులు వచ్చి మహిళ మృతదేహాన్ని ఆదివారం(జులై 2) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా లో చోటుచేసుకుంది. మహిళ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
Also read : Disqualification Petition : తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎన్సీపీ అనర్హత పిటిషన్లు.. నెక్స్ట్ ఏమిటి ?
“సుమిత్రి అనే 40 ఏళ్ల మహిళ మృతదేహాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము. ఆమె సోదరుడు అభయ్ తివారీ తన బావ భరత్ మిశ్రా ఈ హత్య చేశాడని ఫిర్యాదు చేయడంతో.. మేం డెడ్ బాడీని(Wifes Body In Freezer) స్వాధీనం చేసుకున్నాము” అని రేవా సిటీ కొత్వాలి పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ విజయ్ సింగ్ తెలిపారు. “ఆమె జాండిస్‌తో బాధపడుతోందని.. జూన్ 30 న(శుక్రవారం) చనిపోయిందని ఆమె భర్త మాకు చెప్పాడు” అన్నారాయన. ” మా సోదరి మరణం గురించి బావ మిశ్రా మాకు చెప్పలేదు. ఆదివారం (జులై 2న ) ఉదయం మాకు ఆ విషయం తెలిసింది” అని తివారీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. మిశ్రా తన సోదరిని కొట్టేవాడని, దాని వల్లే ఆమె చనిపోయి ఉండొచ్చన్నాడు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఎంక్వైరీ చేస్తామని పోలీసులు వెల్లడించారు.