Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గఢ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో శిథిలావస్థలో ఉన్న గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
సమాచారం ప్రకారం గ్రామ్ గర్ నైగర్హి మలుపు వద్ద సన్‌రైజ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో గోడ కూలిపోయింది. శిథిలాల కింద ఎనిమిది మంది చిన్నారులు సమాధి అయ్యారు. వీరిలో నలుగురు చనిపోయారు. భవనం పాతదని చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన గోడ వర్షం మరియు తేమను తట్టుకోలేకపోయింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారులపై గోడ కూలినట్లు తెలుస్తుంది.
గాయపడిన చిన్నారులను గంగేవ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల సహకారంతో మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. రేవా పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పిల్లల మరణాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. సమాచారం ప్రకారం నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Funding Narco Terrorism: కాశ్మీర్‌లో తీవ్రవాద నిధుల రాకెట్ గుట్టు రట్టు