Site icon HashtagU Telugu

Madhu Goud Yaskhi : మధుయాష్కీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Madhu Yashki Hospitals

Madhu Yashki Hospitals

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Goud Yaskhi) సోమవారం అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న ఇతర నేతలు, సిబ్బంది వెంటనే సహాయం అందించారు.

మధుయాష్కీ గౌడ్‌కి మొదట సచివాలయంలోని డిస్పెన్సరీలోనే అత్యవసర వైద్యం అందించారు. అనంతరం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయనను గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రి(AIG Hospitals)కి తరలించారు. వైద్యులు తక్షణ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించారు.

Sam Konstas: టెస్ట్‌ను వ‌న్డేగా మార్చిన ఆస్ట్రేలియా బ్యాట‌ర్‌.. అద్భుత సెంచ‌రీ!

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. మధుయాష్కీ గౌడ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. బీపీ ఒక్కసారిగా పెరగడంతోనే ఆయన స్పృహ తప్పికిందపడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. మధుయాష్కీ కిందపడ్డాడని తెలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ప్రమాదం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఆయన త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని అనుచరులు ఆకాంక్షిస్తున్నారు.