స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదాంత్ అందరితో శభాష్ అనిపిస్తున్నాడు. ఆయన స్విమ్మింగ్ పోటీల్లో మరోసారి మన దేశానికి ఒక పతకాన్ని సాధించి పెట్టారు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్‌లో వేదాంత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 500 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో వేదాంత్ ఈ పతకం గెలిచారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో వేదాంత్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. మాధవన్ తన కొడుకును మాత్రమే కాకుండా బంగారు పతకం సాధించిన సాజన్ ప్రకాష్‌ను కూడా అభినందించారు. ఇక ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వేదాంత్ గురువు ప్రదీప్‌కు కూడా ధన్యవాదాలు చెప్పారు.
Madhavan: స్విమ్మింగ్ లో సత్తా చాటిన హీరో మాధవన్ కొడుకు

Madhavan