Site icon HashtagU Telugu

Lungi and Nightie: ఇకపై అక్కడ లుంగీ – నైటీ నిషేధం

Lungi and Nightie

887731 Zshppjgxkd 1533306755

Lungi and Nightie: స్కూల్, ఆఫీస్ లలో డ్రెస్ కోడ్ సహజం. కానీ కొన్ని ప్రదేశాల్లో అంటే సొసైటీలో కూడా డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు కొందరు. తాజాగా నోయిడాలో ఈ నియమం అమలు అయింది. వివరాలలోకి వెళితే..

నోయిడాలోని హింసాగర్ అపార్ట్‌మెంట్ సొసైటీలో సాయంత్రం వేళలో వాకింగ్ చేస్తుంటారు. అయితే మహిళలు నైటీలతో, పురుషులు లుంగీలు ధరించి వాకింగ్ చేయడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాజాగా ఆ సొసైటీ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేమంటే.. ఇకపై హింసాగర్ అపార్ట్‌మెంట్ లో లుంగీలు, నైటీలతో వాకింగ్ చేయడం నిషేధమని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ అపార్ట్మెంట్ లోని అందరికి లేక పంపింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఖంగుతిన్నారు.

సొసైటీలో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వేసవిలో ఉదయం మరియు సాయంత్రం సొసైటీలో వాకింగ్ చేయడం సర్వసాధారణం. కొందరు వాకర్స్ లుంగీ, నైటీ వేసుకుని నడుస్తుంటారు. దీనిపై సొసైటీకి చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంఘం కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సమాజంలోని వ్యక్తులు సమాజంలో తిరిగేటప్పుడు వారి ప్రవర్తన మరియు వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాబట్టి మీ ప్రవర్తనపై ఎవరికీ అభ్యంతరం లేదు. సమాజంలో నివసించే పిల్లలు కూడా మీ నుండి నేర్చుకుంటారు. లుంగీ, నైటీలు ఇంటి డ్రెస్‌ అని అందరికీ విజ్ఞప్తి చేశారు సొసైటీ అధ్యక్షుడు సీకే కల్రా.

Read More: Haryana Farmers: ప్రభుత్వంపై రైతు విజయం