Jens Ritter: ఫ్లైట్ లో ప్రయాణికులకు సేవలందించిన ఎయిర్ లైన్స్ సీఈవో.. అసలేం జరిగిందంటే?

మామూలుగా కంపెనీ సీఈవో అంటే ఏం చేస్తుంటారు దర్జాగా ఒక ఆఫీసులో కూర్చుని వారి కింద ఉన్న పని వారిని అలా చేయండి ఇలా చేయండి జాగ్రత్తలు చెబుతూ

  • Written By:
  • Publish Date - August 24, 2023 / 03:45 PM IST

మామూలుగా కంపెనీ సీఈవో అంటే ఏం చేస్తుంటారు దర్జాగా ఒక ఆఫీసులో కూర్చుని వారి కింద ఉన్న పని వారిని అలా చేయండి ఇలా చేయండి జాగ్రత్తలు చెబుతూ అజమాయిషి చెలాయిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ కంపెనీకి సంబంధించిన వర్కర్లు లేదా కస్టమర్ ల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి నేరుగా వారిలోకి వెళుతూ ఉంటారు. ఇక ఏమైనా సమస్యలు ఉన్నాయంటే పక్కవారిని పిలిచి మరి అటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే సీఈవో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అని చెప్పవచ్చు.

ఆయన విమానయాన సంస్థకు సీఈవో అయినా కూడా ఆ హుందాతనం లేదు. తన సంస్థ అందించే సేవలను, వినియోగదారుల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావించారు. అందుకోసం సిబ్బందితో కలిసి విమానంలో స్వయంగా సేవలను అందించారు. కంపెనీ సీఈఓ అయ్యి ఉండి కూడా ప్రయాణికులకు సిబ్బందితో కలిపి సేవలు అందించడం అన్నది నిజంగా గొప్ప విషయమే అని చెప్పవచ్చు. అయితే ఆ అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకొన్నారు. జర్మనీకి చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ సీఈవో జెన్స్‌ రిట్టర్‌ సాధారణ క్రూ వలే విమానంలో విధులు నిర్వర్తించారు. సిబ్బంది సవాళ్లు, ప్రయాణికుల అవసరాలను నేరుగా తెలుసుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
కొన్ని సార్లు కొత్త అనుభవాలను తెలుసుకోవాలంటే మనం ప్రయాణాన్ని మార్చుకోవాలి.

ఈ వారం మా లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమాన సిబ్బందితో కలిసి ఫ్రాంక్‌ఫర్డ్‌ నుంచి రియాద్‌కు వెళ్లే విమానంలో అదనపు సిబ్బందిగా విధులు నిర్వహించాను. లుఫ్తాన్సా గ్రూప్‌తో కలిసి చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కానీ, క్యాబిన్‌ సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ అనుభవం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రతి ప్రయాణానికి ముందు అవసరమైన ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయాను. అయితే, ఇక్కడ నేను ఒకటి గమనించాను. మెనుకార్డులోని భోజనం, వాస్తవానికి ప్రయాణ సమయంలో పెట్టిన భోజనం మధ్య తేడాను గుర్తించాను. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చాను అని రాసుకోచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ సీఈవో చేసిన పనికి ఆయన సింప్లిసిటీకి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.