Site icon HashtagU Telugu

Poisonous Food: చికెన్ లో చనిపోయిన ఎలుక.. యజమానిపై కేసు నమోదు?

Poisonous Food

Poisonous Food

ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ ఫుడ్స్ లో బొద్దింకలు, బల్లులు, ఎలుకలు లాంటివి కనిపించిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. వెంటనే కస్టమర్స్ వాటిని పై అధికారులు దృష్టికి తీసుకెళ్తుండడంతో వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి డాబాలో ఆహారాన్ని ఆర్డర్ చేయగా అందులో చనిపోయిన ఎలుక కనిపించడంతో వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. ఇప్పుడు దాబా యజమానిపై కేసు నమోదైంది. అసలేం జరిగిందంటే.. దాబాలో తినేందుకు వెళ్లిన ఒక కుటుంబం చికెన్ కర్రీ ఆర్డర్ చేసింది. ఆహారం ఎదురుగా రాగానే చికెన్ కూరలోనే చనిపోయిన ఎలుక కనిపించింది. ఈ వీడియోను కుటుంబ సభ్యులు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితుడి పేరు వివేక్ కుమార్. వివేక్ ప్రేమ్ నగర్ ఫీల్డ్ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వివేక్ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

ఆదివారం తన కుటుంబంతో కలిసి విశ్వకర్మ చౌక్‌లోని ప్రకాష్ ధాబాలో భోజనం చేసేందుకు వెళ్ళి అక్కడ ఒక డాబాలో చికెన్ కర్రీని కూడా ఆర్డర్ చేశాడు. అందులో చనిపోయిన ఎలుక బయటకు వచ్చింది. దీనిపై దాబా సిబ్బందికి ఫిర్యాదు చేయగా, తనను దుర్భాషలాడారని బెదిరించారని వివేక్ చెప్పారు. దాన్ని వివేక్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతను కొంత ఆహారం కూడా తిన్నాడు, దాని కారణంగా చాలా మంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణించింది. ఇప్పుడు పోలీసులు దాబా యజమానిపై పాడైన ఆహారాన్ని విక్రయించే చట్టాల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కుట్ర పూరితంగా ఈ వీడియో తీశారని, తారుమారు చేశారని దాబా యజమాని చెబుతున్నారు.

Exit mobile version