Site icon HashtagU Telugu

Hyderabad: లక్కీస్ బిర్యానీ హౌస్‌ కు రూ.55,000 ఫైన్!

Biryani

Biryani

హైదరాబాద్ తిలక్ నగర్‌లోని లక్కీస్ బిర్యానీ హౌస్‌కి ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌కు రూ. 5.50 అదనంగా వసూలు చేసినందుకు రూ. 55,000 జరిమానా విధించింది. 10 శాతం వడ్డీ రేటుతో రూ. 5.50 రీఫండ్ చేయాలని రెస్టారెంట్ యాజమాన్యాన్ని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన చిలుకూరి వంశీ అనే విద్యార్థి, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌పై ఎంఆర్‌పీపై రూ.5.50 అదనంగా వసూలు చేశారంటూ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయమైన హోటల్ మేనేజ్ మెంట్ ను ప్రశ్నించినప్పుడు పరుష పదజాలంతో దూశించారని తెలిపాడు. యువకుడి ఆధారాలు, వాదనలను నమోదు చేసిన కమిషన్ రూ. 50,000 జరిమానా చెల్లించాలని, ఫిర్యాదుదారుడికి 10 శాతం వడ్డీ ఇవ్వాలని ఆదేశించింది.