Site icon HashtagU Telugu

Drugs Case : డార్క్ వెబ్‌సైట్ ద్వారా డ్ర‌గ్స్ విక్ర‌యం.. న‌లుగురు అరెస్ట్‌

Drugs Imresizer

Drugs Imresizer

డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురిని లక్నోలో పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ ముఠాకు డార్క్ వెబ్ ద్వారా అక్రమ డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తుల ప‌క్కా స‌మాచారంతో పోలీసులు ప‌ట్టుకున్నారు. లక్నో పరిసర ప్రాంతాల నుంచి తాము కొనుగోలు చేసిన డ్రగ్స్‌ని అంతర్జాతీయ కొనుగోలుదారులకు సరఫరా చేయడం ఈ ముఠా పని విధానం. ముఠా సభ్యులకు డార్క్ వెబ్ ద్వారా ఎలాంటి డ్రగ్స్ కావాలో డిమాండ్ చేశారు. నిందితులు డ్ర‌గ్స్‌ని కొరియర్ ద్వారా సరఫరా చేసి బిట్‌కాయిన్‌లలో చెల్లింపును అంగీకరించారు. ఫైజాన్ ఖాన్, సుఫియాన్, అష్రఫ్ ఖాన్, సార్థక్ వర్మలను . ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రో నిందితుడు సుమిత్ శర్మ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.