New Army Chief: కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

ఇండియ‌న్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
army chief

Army Chief New 0 Imresizer

ఇండియ‌న్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 29వ ఆర్మీ చీఫ్ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన మొదటి అధికారిగా మ‌నోజ్‌పాండే ఉన్నారు. మ‌నోజ్ పాండే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి.. డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ఆయ‌న నియమించబడ్డారు.

జమ్మూ, కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఇంజనీర్ రెజిమెంట్‌కు ఆయ‌న నాయకత్వం వహించారు. డిసెంబర్ 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ పరాక్రమ్ భారతదేశం, పాకిస్తాన్‌లను యుద్ధం అంచుకు తీసుకువచ్చింది. లెఫ్టినెంట్ జనరల్ పాండే వెస్ట్రన్ థియేటర్‌లో ఇంజనీర్ బ్రిగేడ్‌కు, నియంత్రణ రేఖ వెంబడి పదాతి దళానికి నాయకత్వం వహించారు. లడఖ్ సెక్టార్‌లో పర్వత విభాగానికి, ఈశాన్య ప్రాంతంలో ఒక కార్ప్స్‌కు కూడా ఆయ‌న నాయకత్వం వహించారు ఈస్టర్న్ కమాండ్ బాధ్యతలు చేపట్టకముందు అండమాన్, నికోబార్ కమాండ్ కమాండర్-ఇన్-చీఫ్‌గా ప‌ని చేశారు.

  Last Updated: 18 Apr 2022, 09:21 PM IST