Site icon HashtagU Telugu

LSG vs MI Pitch Report: స్పిన్నర్లకు అనుకూలంగా చెపాక్ స్టేడియం

LSG vs MI

New Web Story Copy 2023 05 24t171142.578

LSG vs MI Pitch Report: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్‌ జెయింట్‌ ఇరు జట్లు ఫైనల్‌ పోరుకు సిద్ధపడుతున్నాయి. ఎలిమినేషన్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెపాక్ స్టేడియంలో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది ( LSG vs MI Eliminator). చెపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్ చూస్తే..స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో బ్యాట్స్‌మెన్లు భీకరంగా పరుగులు సాధించవచ్చు. ఈ సీజన్ లో 7 మ్యాచ్‌లు చెపాక్‌లో జరిగాయి. ఏడు మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు 100 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో బ్యాట్స్‌మెన్లు కూడా భీకరంగా పరుగులు రాబట్టారు. ఈ ఐపీఎల్ సీజన్లో చెపాక్ స్టేడియం లో ఛేజింగ్ జట్లు నాలుగు సార్లు గెలిచాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఇక్కడ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాయి.

ముంబై జట్టు విషయానికి వస్తే.. ఈ జట్టు అతిపెద్ద బలం బ్యాటింగ్ లైనప్. కామెరాన్ గ్రీన్, ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఫర్వాలేదనిపిస్తున్నాడు.

లక్నో స్పిన్నర్ల విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో కృనాల్ పాండ్యా మరియు రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అనుభవజ్ఞుడైన బౌలర్ అమిత్ మిశ్రా కూడా జట్టును ఆదుకుంటున్నాడు. ఫాస్ట్ బౌలర్లు నవీన్-ఉల్-హక్ మరియు మొహ్సిన్ ఖాన్ కూడా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నారు.

Read More: IPL 2023 Qualifier 1: ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో ? ప్లే ఆఫ్ సమరానికి చెన్నై.గుజరాత్ రెడీ