Site icon HashtagU Telugu

KL Rahul Fined: సెంచరీ హీరోకు జరిమానా

KL Rahul

KL Rahul

ఐపీఎల్ 15వ సీజన్ లో లక్నో టీమ్ అదరగొడుతోంది. ముంబైపై 18 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టీకలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. వందో మ్యాచ్‌లో వంద పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాహుల్ కేవలం 60 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో ఉన్న సెంచరీ బాయ్ కేఎల్ రాహుల్‌పై భారీ జరిమానా పడింది.

ఇదివరకు రోహిత్ శర్మ సహా ఒకరిద్దరు కేప్టెన్లు చేసిన తప్పును అతనూ పునరావృతం చేశాడు. స్లో ఓవర్ రన్‌రేట్‌ను మెయింటెయిన్ చేశాడు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేక పోవడంతో 12 లక్షల రూపాయాల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇది తొలి తప్పు. రెండోసారి కూడా అదే జరిగితే జరిమానా రెట్టింపు అవుతుంది.

అలాగే కెప్టెన్‌తో పాటు మిగిలిన 10 మంది ప్లేయర్లూ ఆరు లక్షల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రెండు సార్లు స్లో ఓవర్ రేటు జరిమానాకు గురయ్యాడు. మరోసారి ఇదే తప్పిదం చేస్తే ఫైన్ తో పాటు ఒక మ్యాచ్ నిషేధానికి గురవుతాడు.