Site icon HashtagU Telugu

LRS : ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు

Lrs Concession Period Has E

Lrs Concession Period Has E

లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)లో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసింది. అయితే ఈ గడువు ముగిసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు నమోదుకాలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా రాయితీ గడువును పొడిగించాలా? లేదా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలా? అనే అంశంపై ప్రభుత్వం మళ్లీ సమీక్ష నిర్వహించనుంది.

రెండు రోజుల్లో ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు అంశంపై అధికారికంగా సమీక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న 25 శాతం రాయితీ కొనసాగిస్తారా? లేక దీనిలో మార్పులు చేస్తారా? అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలు లేని అనధికారిక లేఔట్లను చట్టబద్ధం చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రాకపోవడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో మరో మార్గాన్ని అన్వేషించాలని అధికారులు భావిస్తున్నారు.

E-Luna : అష్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్లు

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. 25 శాతం రాయితీ పై మార్పులు వచ్చే అవకాశం ఉంది. స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేయవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా, మిగతా రిజిస్ట్రేషన్లు ప్రోత్సహించేలా మరింత సులభతరమైన విధానాన్ని తీసుకురావొచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు అంశంపై ఎల్లుండి జరిగే సమావేశం తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించనుంది.