LPG Tankers Strike : LPG ట్యాంకర్ల సమ్మె.. తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

LPG Tankers Strike : ముఖ్యంగా ట్యాంకర్లలో అదనపు డ్రైవర్ లేదా క్లీనర్ లేకపోయినా రూ.20,000 జరిమానా విధించే నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది

Published By: HashtagU Telugu Desk
Lpg Tanker Strike

Lpg Tanker Strike

LPG ట్యాంకర్ల ఓనర్స్ అసోసియేషన్ సమ్మె(LPG Tankers Strike)కు దిగింది. చమురు కంపెనీలు తీసుకువచ్చిన కొత్త కాంట్రాక్ట్ నిబంధనలతో (New contract terms brought by oil companies) అసోసియేషన్ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ట్యాంకర్లలో అదనపు డ్రైవర్ లేదా క్లీనర్ లేకపోయినా రూ.20,000 జరిమానా విధించే నిబంధనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దక్షిణ భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో 4,000 LPG ట్యాంకర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

Prabhas Wedding : హైదరాబాద్ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇళ్లకు అవసరమైన గృహ వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. వాణిజ్య రంగంలో కూడా రెస్టారెంట్లు, హోటళ్లకు అవసరమైన LPG అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. LPG సరఫరాలో ఏ మాత్రం అంతరాయం కలిగినా, వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.

Rohit Sharma Captaincy: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడా లేదా?

LPG ట్యాంకర్ల సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం, చమురు కంపెనీలు మరియు అసోసియేషన్ మధ్య చర్చలు జరుగుతాయని సమాచారం. ఈ సమస్య త్వరగా పరిష్కారం కాకుంటే, తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు ఈ సమ్మె ప్రభావాన్ని గమనిస్తూ త్వరగా పరిష్కారం రావాలని ఎదురు చూస్తున్నారు.

  Last Updated: 27 Mar 2025, 03:19 PM IST