Site icon HashtagU Telugu

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ పై ఈ నెంబర్ ఎందుకు ఉంటుందో తెలుసా?

Lpg Gas Cylinder

Lpg Gas Cylinder

అప్పట్లో గ్యాస్ సిలిండర్ లు అందుబాటు లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుని తింటూ ఉండేవారు. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ఇళ్లలో గ్యాస్, సిలిండర్ లు పూర్తి అందుబాటులోకి వచ్చేసాయి. పట్టణాలతో పాటు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ గ్యాస్ సిలిండర్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో అయితే ఒక్కొక్కరి ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్ లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే గ్యాస్ సిలిండర్ లు ఉపయోగిస్తూ ఉంటారు కానీ వాటిని పెద్దగా గమనించరు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ లకు ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ కొత్త గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు దానిని గమనించడం తప్పనిసరి. ఈ ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవడం ఎలా అంటే ఎసిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్ లో ఒకదానిపై లోపలి వైపు అందుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అంటే A 25, B 30, B 25 వాటి ద్వారా ఎక్స్పైరీ డేట్ ని తెలుసుకోవచ్చు.

A 25 అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. మార్చి తర్వాత ఆ సిలిండర్ మళ్లీ పంపిణీకి రావాల్సి ఉంటుంది. B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని అర్థం. C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని అర్థం. D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం.