Site icon HashtagU Telugu

Cylinder on Railway Track: కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్, సకాలంలో గుర్తించి.

Cylinder on Railway Track

Cylinder on Railway Track

Cylinder on Railway Track: దేశంలోని అనేక రాష్ట్రాల్లో, అనేక సార్లు రైళ్లను బోల్తా కొట్టే ప్రయత్నాలు జరిగాయి. కాన్పూర్‌ (Kanpur)లో ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్‌ (gas cylinder)ను ఉంచి రైలును బోల్తా కొట్టే ప్రయత్నం జరిగింది. అయితే ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం కాన్పూర్ దేహత్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ గుర్తించారు. ట్రాక్ పై సిలిండర్ పెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌రాజ్ డివిజన్‌లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం చిన్న ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచినట్లు చెబుతున్నారు. ఈ ట్రాక్ గుండా గూడ్స్ రైలు వెళ్లబోతుండగా, అంతకు ముందే లోకో పైలట్ కళ్లు సిలిండర్ పై పడ్డాయి. లోకో పైలట్ వెంటనే గూడ్స్ రైలును ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ ఉంచిన ప్రాంతం కాన్పూర్ దేహాద్ జిల్లాలో ఉంది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు కిలోల బరువున్న ఎల్‌జీపీ సిలిండర్‌ను రైల్వే ట్రాక్‌పై ఉంచారు. సిలిండర్‌లో గ్యాస్‌ లేదు. రైలు వేగం చాలా తక్కువగా ఉందని, ఈ కారణంగా సిలిండర్‌ను చూసిన వెంటనే లోకో పైలట్ రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్ మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించింది. దీంతో పాటు స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు.

ఇంతకు ముందు కూడా దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైళ్లను బోల్తా కొట్టించే కుట్ర జరిగింది. సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు ఘటన వెలుగులోకి వచ్చింది. ఆపై ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పీజీ సిలిండర్‌ను ఢీకొట్టింది. ఘటనా స్థలంలో పెట్రోల్‌ నింపిన బాటిల్‌, అగ్గిపుల్లలతో పాటు గన్‌పౌడర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత సెప్టెంబర్ 10న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర పన్నారు. ఇక్కడ అజ్మీర్‌లోని సర్ధానాలోని రైల్వే ట్రాక్‌పై ఒక్కొక్కటి 70 కిలోల బరువున్న రెండు సిమెంటు బ్లాక్‌లను ఉంచి గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కూడా గూడ్స్ రైలును బోల్తా కొట్టేందుకు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ రాళ్లను వేశారు.

Also Read: India vs Bangladesh: భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 92 ఏళ్ల త‌ర్వాత చ‌రిత్ర సృష్టించిన టీమిండియా..!