Site icon HashtagU Telugu

SBI: ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు అదిరిపోయే శుభవార్త.. తక్కువ వడ్డీకే రుణం పొందే ఛాన్స్?

SBI loan

SBI loan

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ వీలర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. తక్కువ వడ్డీకే టూ వీలర్ లోన్లను అందిస్తోంది. 20,000 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఈ ఆఫర్ లో భాగంగా ఎస్బీఐ కస్టమర్లు లోన్ పొందే అవకాశం ఉండగా ఎస్బీఐ కస్టమర్లకు ఈ లోన్ ఆఫర్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. లక్ష రూపాయల లోన్ తీసుకుంటే నెలకు 2510 రూపాయల చొప్పున ఈ.ఎం.ఐ చెల్లించాల్సి ఉండగా లోన్ తీసుకున్న సమయంలో డౌన్ పేమెంట్ 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్ కు 9.35 శాతం వడ్డీరేటు కాగా 4 సంవత్సరాలలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

మార్చి 31వ తేదీలోపు ఈ ఆఫర్ ను పొందితే ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. ఎంపిక చేసిన కస్టమర్లు మాత్రమే ఎస్బీఐ ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎంపిక చేసిన కస్టమర్లకు ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ను అందించనుందని సమాచారం అందుతోంది. బ్యాంక్ కండీషన్లను, ఇతర వివరాలను పూర్తిగా తెలుసుకుని ఈ ఆఫర్ కు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వాహనం ఆన్ రోడ్ ధర, డీలర్ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఆఫర్ ఎస్బీఐ కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Exit mobile version