Site icon HashtagU Telugu

Lovers Romance In Metro : మెట్రోలో ముద్దుల్లో మునిగిన ప్రేమ జంట

Metro Lovers Romance

Metro Lovers Romance

ఇటీవల ప్రేమ జంటలు (Lovers) రెచ్చిపోతున్నారు. ప్రేమ (Love) అనేదాని అర్ధమే మార్చేశారు కొంతమంది ప్రేమికులు. ప్రేమ పేరుతో కామ (Romance) కోర్కెలు తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ.. పబ్లిక్ గా రొమాన్స్ (Lovers Public Romance) లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల ఎవరు ఉన్నారు..మనం ఎక్కడ ఉన్నాం..ఏంచేస్తున్నాం అనేది కూడా ఆలోచించకుండా రెచ్చిపోతున్నారు. లెఫ్ట్ లలో , పార్క్ లలో , రహస్య ప్రదేశాలలో రొమాన్స్ చేసుకుంటున్న ఘటనలకు సంబదించిన వీడియోస్ ఎన్నో వెలుగులోకి రాగా..ఈ మధ్య మెట్రో ట్రైన్ లలో , MMTS ట్రైన్స్ లలో రెచ్చిపోవడం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రో లో ఓ జంట ఇలాగే ముద్దుల్లో మునిగిపోయి..సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసారు.

ఢిల్లీ మెట్రో (Delhi Metro) అంటే నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. అయినప్పటికీ అంత జనాల మధ్య ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు. ఇద్దరూ గట్టిగా హత్తుకుని..ముద్దులు పెట్టుకుంటూ.. తాకరాని చోట తాకుతూ రొమాన్స్ చేసుకుంటున్నారు. వీళ్లకి ఇంకెక్కడా చోటు లేనట్లు రైలే దొరికిందా. అని కొందరు మనసులో అనుకుంటూ సిగ్గుతో అటు చూడడం మానేశారు. కానీ ఓ పెద్దావిడ మాత్రం వీరి రొమాన్స్ చూస్తూ ఉండలేకపోయింది. కోపం తో దగ్గరికి పోయి..సదరు యువతిని బండబాతులు తిడుతూ రెచ్చిపోయింది.

Read Also : Tamilnadu: నాటు బాంబు కొరికిన ఏనుగు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?

ఆడపిల్లవు చుట్టు జనాలు ఉన్నారని కొంచెం కూడా బుద్ది లేదా అంటూ ఒంటికాలుపై లేచింది.. చెడా మడా తిట్టేసింది.. మా ఇష్టం మాది.. మధ్యలో మమ్మల్ని నిలదీయడానికి నువ్వెవరు’.. అంటూ సదరు యువతీ ఎదురు ప్రశ్నించింది. దీంతో కొద్దిసేపు వారి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. చివరకు పక్కన ఉన్న వారు కలుగజేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న వారు తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. అంతే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.