60 Crores Painting : ఈ పెయింటింగ్ 60 కోట్లు.. అందులో ఇంట్రెస్టింగ్ స్టోరీ

60 Crores Painting : 2008 సంవత్సరంలో వేలంలో రూ.32 లక్షలే పలికిన ఒక పెయింటింగ్ కు దశ తిరగనుంది..వచ్చే నెలలో లండన్ లోని  సోత్ బే (Sotheby's)లో  మళ్ళీ వేలానికి రానున్న ఈ పెయింటింగ్ రూ.60 కోట్లకు పైనే రేటు పలకొచ్చని అంచనా వేస్తున్నారు. 

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 02:28 PM IST

60 Crores Painting : విలువ తెలిస్తే .. ఒక రేంజ్ దొరుకుతుంది అనే దానికి నిదర్శనం ఇదే.

2008 సంవత్సరంలో వేలంలో రూ.32 లక్షలే పలికిన ఒక పెయింటింగ్ కు దశ తిరగనుంది..

వచ్చే నెలలో లండన్ లోని  సోత్ బే (Sotheby’s)లో  మళ్ళీ వేలానికి రానున్న ఈ పెయింటింగ్ రూ.60 కోట్లకు పైనే రేటు పలకొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఒక్కసారిగా దీని రేటు ఎందుకు పెరిగింది ? ఆ పెయింటింగ్ లో ఏముంది ?

రూ.60 కోట్లు ధర పలికే అవకాశమున్న ఈ పెయింటింగ్ పేరు “లాస్ట్ రూబెన్స్”. ఇది  16 శతాబ్దం నాటిది. ఈ పెయింటింగ్ ను అప్పటి ప్రఖ్యాత చిత్రకారుడు పీటర్ పాల్ రూబెన్స్ వేశారు. ఈవిషయం తెలియనంత వరకు దీని రేటు కేవలం రూ.32 లక్షలే. 2021లో జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 16వ శతాబ్దం నాటి డచ్ ఆర్టిస్ట్ హెండ్రిక్ టెర్ బ్రూగెన్ వేసిన ” సెయింట్ సెబాస్టియన్ టెండెడ్ బై ఏంజిల్స్” అనే పెయింటింగ్ ను గ్రీస్ దేశం నుంచి తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించారు. అదే టైం కు చెందిన  పీటర్ పాల్ రూబెన్స్ వేసిన “లాస్ట్ రూబెన్స్” పెయింటింగ్ ను దాని పక్కనే డిస్ ప్లే చేశారు.

Also read : Peacock Feathers: నెమలి ఈకలు ఇంట్లో ఉంటే అందంతోపాటు సంపద కూడా.. ఎలా అంటే?

ఇవి రెండూ ఒకే కాన్సెప్ట్ పై వేసిన పెయింటింగ్స్ కావడంతో ప్రఖ్యాత ఆర్టిస్టులు వాటిని నిశితంగా పరిశీలించారు. దీంతో  ” సెయింట్ సెబాస్టియన్ టెండెడ్ బై ఏంజిల్స్” అనే పెయింటింగ్ ను.. “లాస్ట్ రూబెన్స్” పెయింటింగ్ కు కాపీ గా నిపుణులు నిర్ధారించారు.  అంటే “లాస్ట్ రూబెన్స్” పెయింటింగ్ ఒరిజినల్ అని తేలింది. ఎక్స్ రే సహాయంతో చేసిన విశ్లేషణలో ఈవిషయం వెల్లడైంది. దీంతో మార్కెట్లో దాని ధర రెక్కలు తొడిగింది. ఈ తరుణంలో వచ్చే నెలలో లండన్ లోని సోత్ బే లో ఈ పెయింటింగ్ కు నిర్వహించనున్న వేలంపాట కోసం భారీ పోటీ(60 Crores Painting) నెల్లకొంది. “లాస్ట్ రూబెన్స్” పెయింటింగ్ 1730లలో అదృశ్యమైందని.. 1963లో అది అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలో ఒకచోట ప్రత్యక్షమైందని అంటారు.  ఈ పెయింటింగ్ సెబాస్టియన్ అనే రోమన్ సైనికుడి కథను వర్ణిస్తుంది. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత అతడిని చెట్టుకు కట్టేసి, సైనికులు బాణాలు ప్రయోగించారు. సెబాస్టియన్ తుదిశ్వాస విడిచే టైంలో దైవదూతలు ఆ చెట్టు దగ్గరికి  వచ్చి..  అతడి ఒంటిపై ఉన్న బాణాలు తొలగించడం, కాళ్లకు, చేతులకు కట్టి ఉన్న తాళ్లను విప్పడం ఈ పెయింటింగ్ లో అద్భుతంగా కనిపిస్తుంది.