India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Updated On - December 20, 2021 / 05:02 PM IST

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేలా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. లోక్ సభలో విపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. బిల్లు ఆమోదించిన అనంతరం లోక్ సభ వాయిదా పడింది.

ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఓటరు కార్డును ఆధార్ తో లింక్ చేయాలనే నిబంధన ఈ బిల్లులో ఉంది. ఎన్నికల్లో ఒక వ్యక్తి పలు ప్రాంతాల్లో ఓటర్ గా నమోదు చేసుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఈ సవరణతో అలంటి దొంగ ఓటర్లను కట్టడి చేయవచ్చని మంత్రి అన్నారు. సదరు వ్యక్తికి ఆధార్ కార్డు లేని పక్షం లో ఇతర ఐడి ప్రూఫ్ తో నమోదు చేసుకునే వెసులుబాటును కూడా ఈ బిల్లులో చేర్చారు. అయితే ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపించాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేంద్రం వైఖరి ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.