Site icon HashtagU Telugu

Lokesh: అమ్మఒడిపై చినబాబు సటైర్లు…మామూలుగా లేవుగా..!!

Nara Lokesh Ys Jagan

Nara Lokesh Ys Jagan

ఏపీలోని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న టీడీపీ నేత, యువనాయకుడు మాజీ మంత్రి నారాలోకేష్…తాజాగా మారోసారి విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని…జగన్ మోసపు రెడ్డిగా మార్చేసిన…లోకేశ్ ఊరువాడా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర పథకాలు…నాయకులపైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు లోకేష్. తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించారు. అంతేకాదు లోకేష్ తనదైన శైలిలో సటైర్లు కూడా వేశారు.

వైసీపీ సర్కారు…అమ్మ ఒడి పథకం కింద..ప్రతిఏటా లబ్దిదారులై బడికి పంపించే చిన్నారులైన తల్లుల అకౌంట్లో రూ. 15000వేస్తున్న విషయం తెలిసిందే. దీనిని ప్రతిఏటా జనవరిలో సంక్రాంతికి ముందే ఇచ్చారు. అయితే తొలి రెండేళ్లు సక్రమంగా వేసిన సర్కారు..ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో జమ చేయలేదు. దీనిని ఈ ఏడాది జులైకి మార్చింది. అంతేకాదు దీనికి ఎన్నో నిబంధనలు కూడా పెట్టింది. విద్యార్థుల హాజరు శాతం నుంచి వారి ఇళ్లలో విద్యుత్ బిల్లుల వరకు నిర్దేశించిన ప్రకారం ఉంటేనే ఈ అమ్మఒడి సాయం అందుతుంది. అదేవిధంగా హాజరు శాతాన్ని కూడా సీరియస్సుగా పరిగణిస్తారు. ఇంటి విద్యుత్ బిల్లు 300యూనిట్లలోపే ఉండాలి. అంతకుమించి ఉన్నట్లయితే ఆ పథకానికి అనర్హులవుతారు.

ఇక ఈ విద్యా సంవత్సరంలో 75శాతం హాజరుఉన్నవారికే…వచ్చే విద్యాసంవత్సరంలో అమ్మఒడిని అందించనున్నారు. ఆధార్ కార్డులో పాత జిల్లాల పేర్లు మార్చాలి. కొత్త జిల్లాల పేర్లను నమోదు చేసుకోవాలి. అమ్మఒడి కింద లబ్ది పొందాలనుకునేవారంతా కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్లి పాత జిల్లా పేరును మార్చి కొత్త జిల్లా పేరును అప్ డేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొత్త రూల్స్ . వీటిపై నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. అమ్మఒడి పథకంపై సెటైర్లు కూడా వేశారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు…పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అని చెప్పినట్లు ఉంది సీఎం జగన్ అమ్మఒడి పథకం అని తనదైన రీతిలో దుయ్యబట్టారు.

తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యికోత పెట్టి అర్థఒడిగా మారిన పథకంపై ఇఫ్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టిపథకం మనుగడనున ప్రశ్నార్థంగా మార్చారని ఆరోపించారు. ఇంటి విద్యుత్ బిల్లు 300యూనిట్లు దాటి కరెంట్ వాడితే…పథకం వర్తించదని కొత్త నిబంధన పెట్టారని విమర్శలు గుప్పించారు. ప్రతి విద్యార్థికి 75శాతం హాజరు…ఆధార్ లో కొత్త జిల్లాల నమోదు…కొత్త బియ్యం కార్డు..ఇవన్నీ ఉంటేనే అమ్మఒడి అనే కండిషన్స్ వర్తిస్తాయని ముందే ఎందుకు చెప్పలేదని లోకేశ్ నిలదీశారు. జగన్ మోసపు రెడ్డి గారు..మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే 30వేలు వేస్తామని ఇఛ్చిన హామీ కూడా తుంగలో కలిపేసారని మండిపడ్డారు. అమ్మలని మానసికంగా క్షోభకు గురిచేసే ఈ ఆంక్షలు తీసేసీ అర్హులందరికీ అమ్మఒడి పథకం వర్తింపచేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.