Lok Sabha Elections 2024: రాంచీలో ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ

ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో ఐదు దశలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆరో దశ పోలింగ్ జరుగుతుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

ఆరో దశ పోలింగ్ లో భాగంగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా రాంచీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐపీఎల్ లో లీగ్ దశలో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ లో ఆర్సీబీపై ఓడింది. ధోనీ నాయకత్వంలో ఇప్పటికే చెన్నై ఐదు సార్లు టైటిల్ గెలిచింది. కాగా ధోనీకి ఈ సీజన్ చివరి ఐపీఎల్ అని వార్తాలు వస్తున్నాయి. ప్రస్తుతం మాహీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. త్వరలోనే ఆయన లండన్ వెళ్లి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ధోనీ లండన్ పర్యటన తర్వాత తన ఐపీఎల్ భవితవ్యాన్ని వెల్లడించనున్నట్లు ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Also Read: Shikhar Dhawan Marrying Mithali Raj: శిఖర్‌ ధావన్‌తో మిథాలీ రాజ్‌‌ పెళ్లి ఫిక్స్ అయిందా? గబ్బర్ రియాక్షన్..