Site icon HashtagU Telugu

Lok Sabha Elections 2024: ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కట్ చేస్తే వెలుగులోకి భారీ నగదు

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖమ్మం మండలం కూసుమంచిలో జరిగిన ప్రమాదంలో భారీగా నగదు బయటపడింది. అతివేగంగా వచ్చిన వాహనం బోల్తా పడగా, అందులో భారీగా డబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో రేపు జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో ఈ నగదు ముడిపడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత ఎన్నికలతో నగదుకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా, తెలంగాణ రేపు పోలింగ్‌కు సిద్ధమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read: Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్‌బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే