ICICI Bank Fraud: పోలీసుల కస్టడీకి చందా కొచ్చర్ దంపతులు, వేణుగోపాల్ ధూత్!

ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్రాడ్ కేసు అనేక మలుపులు తిరుగతోంది.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 02:40 PM IST

లోన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లను జనవరి 10 వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొచ్చర్లను గత శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. ధూత్‌ను సోమవారం అరెస్టు చేశారు. ముగ్గురి రిమాండ్‌ ముగియడంతో గురువారం ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ గ్వాలానీ ఎదుట హాజరుపరిచారు. దీంతో కోర్టు ముగ్గురు నిందితులను జనవరి 10, 2023 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

2019లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దీపక్ కొచర్ నిర్వహించే నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్), సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఇపిఎల్), వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (విఐఇఎల్) వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు కొచర్స్, ధూత్‌లను సిబిఐ నిందితులుగా పేర్కొంది. బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి ఐసిఐసిఐ బ్యాంక్ రూ. 3,250 కోట్ల రుణ సదుపాయాలను మంజూరు చేసిందని సిబిఐ ఆరోపించింది.