Site icon HashtagU Telugu

Biryani: చికెన్ బిర్యానీలో బల్లి, జీహెచ్‌ఎంసీ సీరియస్

Be Careful If You Eat A Lot Of Biryani

Be Careful If You Eat A Lot Of Biryani

Biryani: హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి కొనుగోలు చేసిన చికెన్ బిర్యానీలో బల్లి ఉన్నట్లు కస్టమర్ ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సీరియస్ అయ్యింది.  జొమాటో ద్వారా చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేసిన అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన విశ్వ ఆదిత్య ఫిర్యాదు మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు.

GHMC అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ధృవీకరించినట్లు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జొమాటో డెలివరీ చేసిన వ్యక్తి డెలివరీ చేసిన చికెన్ బిర్యానీలో బల్లి ఉందని విశ్వ ఆదిత్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భోజన ప్రియులు సైతం మండిపడుతున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని మండిపడుతున్నారు.