Site icon HashtagU Telugu

Chandrayaan-3: చంద్రయాన్ ప్రత్యక్ష ప్రసారం – వెబ్‌సైట్ (Isro.gov.in)

Chandrayaan

New Web Story Copy (83)

Chandrayaan-3:చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ లైవ్ అప్‌డేట్‌లు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-3 ఈరోజు చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. యావత్ ప్రపంచం దృష్టి దానిపైనే ఉంది. చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఇస్రో వెబ్‌సైట్ (Isro.gov.in) లేదా యూట్యూబ్ ఛానెల్‌తో పాటు DD నేషనల్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా ఇస్రో చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్‌కు ముందు ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. అదే సమయంలో చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌ను చూసేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఢిల్లీలోని CSIR ప్రధాన కార్యాలయానికి వచ్చారు. భారతదేశం నేడు అంతరిక్ష ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర సృష్టించబోతోంది. ఇస్రో మిషన్ చంద్రయాన్-3 సాయంత్రం 6.గంటల 4 నిమిషాలకు చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది.

Also Read: Jayaho Chandrayaan-3 Live : జాబిల్లి ఫై దిగుతున్న విక్రమ్​ ల్యాండర్ ను చూడండి