Bank Holidays: అక్టోబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్

అక్టోబరు నెలలో హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు ప్రకటించింది. ఈ మాసంలో ఆదివారాలు మరియు రెండవ మరియు నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 16 సెలవులు ఉన్నాయి.

Bank Holidays: అక్టోబరు నెలలో హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లోని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు ప్రకటించింది. ఈ మాసంలో ఆదివారాలు మరియు రెండవ మరియు నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 16 సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కిందకు వస్తాయి. అంటే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారవచ్చు.కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మొత్తం 16 రోజులు మూసివేయబడవు.

హైదరాబాద్ వాసులకు ఆదివారం, రెండో, మూడో శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అదనంగా హైదరాబాద్‌లోని బ్యాంకులకు మరో రెండు సెలవులు ఉన్నాయి, ఒకటి అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి సందర్భంగా. ఈ సెలవు ఇప్పటికే ముగియగా మరొకటి అక్టోబర్ 24న దసరా సందర్భంగా సెలవును ప్రకటించింది ఆర్బీఐ.

అక్టోబర్ 2023లో బ్యాంక్ సెలవుల జాబితా:

అక్టోబర్ 1: ఆదివారం
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
అక్టోబర్ 8: ఆదివారం
అక్టోబర్ 14: మహాలయ
అక్టోబర్ 15: ఆదివారం
అక్టోబర్ 18: కటి బిహు
అక్టోబర్ 21: దుర్గాపూజ (మహా సప్తమి)
అక్టోబర్ 22: ఆదివారం
అక్టోబర్ 23: దసరా (మహానవమి)/ఆయుధ పూజ /దుర్గా పూజ/విజయ దశమి
అక్టోబర్ 24: దసరా/దసరా (విజయ దశమి)/దుర్గాపూజ
అక్టోబర్ 25: దుర్గాపూజ
అక్టోబర్ 26: దుర్గాపూజ
అక్టోబర్ 27: దుర్గాపూజ
అక్టోబర్ 28 పూజ
అక్టోబర్ 29: ఆదివారం
అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు

హైదరాబాద్‌లోని బ్యాంకులకు అక్టోబర్ 1, 2, 8, 14, 15, 22, 24, 28, 29 తేదీల్లో సెలవులు ఉంటాయి.

Also Read: Bank Holidays: అక్టోబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్