Bank holidays in November 2022: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. నవంబర్ నెలలో వరుస సెలవులు?

ఆర్.బి.ఐ ప్రతినెలా కూడా బ్యాంక్ హాలిడేస్ ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక తాజాగా నవంబర్ నెల కు సంబంధించిన

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 05:49 PM IST

ఆర్.బి.ఐ ప్రతినెలా కూడా బ్యాంక్ హాలిడేస్ ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇక తాజాగా నవంబర్ నెల కు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. అయితే నవంబర్ నెల మొదలవడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్.బి.ఐ నవంబర్ కు సంబంధించిన బ్యాంకు సెలవుల వివరాలను ప్రకటించింది. మరి బ్యాంకు కి ఏఏ రోజులు హాలిడేస్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నవంబర్ నెలలో మొత్తం బ్యాంకులకు పది రోజులు సెలవులు ఉండనున్నాయి. నవంబర్​ 1 న కన్నడ రాజ్యోత్సవ కుట్​ బెంగళూరు, ఇపాల్​లో బ్యాంక్​లకు సెలవులు ఉన్నాయి. అలాగే నవంబర్​ 6 న ఆదివారం. నవంబర్​ 8 న గురు నానక్​ జయంతి. కార్తీక పూర్ణిమ,రహస్​ పౌర్ణమి. ఇక నవంబర్​ 11 న కనకదాస్ జయంతి, వంగలా పండుగ. ఇక నవంబర్​ 12 న రెండో శనివారం. నవంబర్​ 13 న ఆదివారం. అలాగే నవంబర్​ 20 న ఆదివారం. నవంబర్​ 23 న సెంగ్​ కుట్సనెమ్​ షిల్లాంగ్​లోని బ్యాంక్​లకు సెలవు.

నవంబర్​ 26 న నాలుగో శనివారం. నవంబర్​ 27 న ఆదివారం. కాగా వచ్చే నెలలో అనగా నవంబర్ లో బ్యాంకులలో పని ఉన్నవారు తప్పకుండా ఈ బ్యాంకులో సెలవుల జాబితాను ఫాలో అవుతూ అందుకు అనుగుణంగా వారి పనులను కేటాయించుకోవడం మంచిది. నవంబర్ నెల మొత్తం పది రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.