Site icon HashtagU Telugu

Hyd:మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి వరకు వైన్స్ షాపులు!

liquor

liquor

న్యూఇయర్ వేల మందుబాబులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. రెంట్లు, పబ్బులు, హోటళ్లు సహా మద్యం అందించే షాపులన్నీ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. మద్యం షాపులను 1 గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం 1 గంటల వరకు కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతిని ఇచ్చింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈవెంట్ల నిర్వహణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎక్సైజ్ శాఖ తాత్కాలిక లైసెన్స్ ను అందించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్యను బట్టి ఎక్సైజ్‌ అధికారులు రూ.50 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేయనున్నారు.