Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌.. కారణం ఇదే..?

Bars

Bars

ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు మ‌ద్యం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. ఢిల్లీ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల కార‌ణంగా ఢిల్లీ ఎక్సైజ్‌శాఖ ప్ర‌క‌టించింది. ఢిల్లీలో శుక్రవారం నుండి ఆదివారం వరకు డ్రై డేలుగా ప్ర‌క‌టించింది. ఈ సమయంలో మద్యం అమ్మకాలు నిషేధించబడతాయని నగర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్‌లోని 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. డిసెంబరు 7వ తేదీని కూడా డ్రై డేగా పాటిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. షాపులు, క్లబ్బులు, బార్లు మొదలైనవాటిలో డ్రైడేలుగా ప్ర‌క‌టించిన రోజుల్లో మద్యం అమ్మకాల‌ను నిషేధించింది.

Exit mobile version