హైదరాబాద్ (Hyderabad) నగరంలో హోలీ (Holi) పండుగ నేపథ్యంలో ఈ నెల 14న మద్యం షాపులు బంద్ (Wine Shops Bandh) కానున్నాయి. పోలీసులు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాన్ని పూర్తిగా నిలిపివేయనున్నారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.
SBI : మరోసారి నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం
హోలీ వేడుకల్లో మద్యం సేవించి ప్రజలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉండటంతో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరు మద్యం తాగినా, లేదా గొడవలకు దిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, రోడ్డుపై ప్రయాణిస్తున్న వారిపై బలవంతంగా రంగులు చల్లడం, గుంపులుగా ర్యాలీలు నిర్వహించడం నిషేధించామని స్పష్టం చేశారు. హోలీ పండుగను ప్రతి ఒక్కరూ సాంప్రదాయ పద్ధతిలో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా జరుపుకోవాలని సూచించారు.
పోలీసుల సూచనల మేరకు నగరంలోని మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయంపై 12 గంటలపాటు ఆంక్షలు ఉంటాయి. ఈ ఆదేశాలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలంతా పోలీసుల సూచనలను పాటించి హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.