తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) కొత్త కంపెనీల నుండి మద్యం బ్రాండ్ల అమ్మకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా కొత్త లిక్కర్, బీర్ కంపెనీలు తమ ఉత్పత్తులను తెలంగాణలో విక్రయించేందుకు అవకాశం పొందనున్నారు. ప్రత్యేకంగా విదేశీ బ్రాండ్లు, దేశీయ లిక్కర్ కంపెనీలు తమ ఉత్పత్తులను రాష్ట్రంలో అమ్మడానికి అనుమతులు పొందేందుకు ముందుకు రాబోతున్నాయి.
Rohit Sharma: వన్డేల్లో వేగంగా 9 వేల పరుగులు చేసిన టాప్- 5 ఓపెనర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!
నూతన కంపెనీలు తమ ఉత్పత్తులను సురక్షితంగా, నాణ్యత ప్రమాణాలతో విక్రయిస్తున్నాయని నిర్ధారించుకునేందుకు తమ అఫిడవిట్లను దరఖాస్తులో జతపరచాలని TGBCL సూచించింది. గతంలో కొన్ని కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చినా, అవి వివాదాస్పదంగా మారిన తర్వాత వాటి అమ్మకాలు నిలిపివేయడమైనది. ఇప్పుడు, ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించి, బహిరంగ ప్రకటన విడుదలచేసి, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతో కొత్త మద్యం బ్రాండ్ల గురించి ప్రజలలో చర్చలు ప్రారంభమయ్యాయి.