Site icon HashtagU Telugu

Liquid Cocaine : లిక్విడ్ కొకైన్ స్మగ్లింగ్.. కూల్ డ్రింక్స్ సీసాలు, షాంపూ బాటిల్స్ లో నింపి..

Liquid Cocaine

Liquid Cocaine

Liquid Cocaine : లిక్విడ్ కొకైన్.. 

ఇప్పుడు దీనిపైనే డిస్కషన్ నడుస్తోంది.. 

పోలీసులు, తనిఖీ అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు డ్రగ్ స్మగ్లర్లు లిక్విడ్ కొకైన్ ను వాడుతున్నారు.. 

ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల కెన్యా మహిళ నుంచి 2 బాటిళ్ల  లిక్విడ్ కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

దాని విలువ దాదాపు రూ.13 కోట్లు.. ఇంతకీ ఏమిటీ లిక్విడ్ కొకైన్ ? 

కొకైన్‌ అనే మత్తు పదార్థపు పొడిని కరిగించి లిక్విడ్ గా మారుస్తున్నందు వల్లే.. దానికి లిక్విడ్ కొకైన్ (Liquid Cocaine) అనే పేరొచ్చింది. కొకైన్ పొడి రూపంలో ఉండగా గుర్తించడం ఈజీ. కానీ ద్రవ రూపంలో ఉన్నప్పుడు గుర్తించడం కష్టం. లిక్విడ్ కొకైన్ ను గుర్తించడానికి UK, స్విట్జర్లాండ్ దేశాలు  రెండు టెక్నాలజీలను అభివృద్ధి చేశాయి. వాటిని ఉపయోగించి.. బాటిల్‌ లో ఉన్న లిక్విడ్ కొకైన్ దా ? మరేదైనా పదార్థానిదా ? అనేది గుర్తిస్తారు.

లిక్విడ్ కొకైన్ తయారీ, స్మగ్లింగ్..  

కొకైన్ అక్రమ రవాణాను సులభతరం చేయడానికి దాన్ని లిక్విడ్ కొకైన్ రూపంలోకి స్మగ్లర్లు మారుస్తున్నారు. కొకైన్ పొడిని నీరు, గ్లూకోజ్, సెల్యులోజ్, లాక్టోస్ వంటి వాటితో కలిపి ద్రవ రూపంలోకి మారుస్తారు.  లిక్విడ్ కొకైన్ ను కూల్ డ్రింక్స్ సీసాలు, నూనె బాటిళ్లు, షాంపూ బాటిల్స్ లో నింపి స్మగ్లర్లు సప్లై చేస్తున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో అమర్చిన స్కానర్ల ద్వారా కూడా దీన్ని పట్టుకోలేరు. ఎందుకంటే లిక్విడ్ కొకైన్ లోని రేడియోలాజికల్ నాణ్యత..  పొడి కొకైన్ లోని రేడియోలాజికల్ నాణ్యత కంటే భిన్నంగా ఉంటుంది. గతేడాది నవంబరు నెలలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నైజీరియా దేశస్థుడి నుంచి లిక్విడ్ కొకైన్ ఉన్న రెండు సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 20 కోట్లు ఉంటుందని అప్పట్లో అధికారులు తెలిపారు.

Also read : Drugs In Soap Cases : వామ్మో.. సబ్బు పెట్టెల్లో కోట్ల డ్రగ్స్

కొకైన్..  ఎల్‌ఎస్‌డీ.. ఎక్స్టసీ.. 

ఒక గ్రాము కొకైన్ ధర 6వేల నుంచి 7వేల రూపాయల మధ్య ఉంటుంది.  కొకైన్ కు అలవాటుపడిన వారు.. దాన్ని ముక్కు ద్వారా, నీటిలో కలిపి తాగడం ద్వారా, నోటిలోని  చిగుళ్ళకు పూయడం ద్వారా, ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు. ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. లిక్విడ్, పేపర్, ట్యాబ్లెట్ రూపంలో వచ్చే ఎల్‌ఎస్‌డీ డ్రగ్ కూడా కొకైన్‌లా ప్రాణాంతకం. దీన్ని తీసుకున్న 20 నిమిషాల తర్వాత.. వ్యక్తి మత్తులోకి జారుకుంటాడు. దీని మత్తు 36 గంటలపాటు ఉంటుంది.  ఎక్స్టసీ లేదా MD డ్రగ్ కూడా పంచదారలా కనిపిస్తుంది. దీన్ని వ్యసనపరులు నీటిలో కలిపి తాగుతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరం.