Site icon HashtagU Telugu

Viral Video: జిరాఫీ పై సింహాల దాడి.. సీన్ కట్ చేస్తే!

Giraffe

Giraffe

బ్యాడ్ టైం వస్తే.. ఎంతటి వాళ్ళైనా తలొగ్గాల్సిందే.. చివరకు అడవికి రాజుగా వెలుగొందే “సింహం” అయినా సరే!! తాజాగా అటువంటిదే ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఐదారు సింహాల మంద ఒక ఒంటరి జిరాఫీని చుట్టు ముట్టాయి. ముందు నుంచి ఎదుర్కొనే ధైర్యం లేక.. వెనుక నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా పంజా విసిరాయి. అయినా జిరాఫీ వెరవ లేదు. బెదర లేదు..కదల లేదు!! రెండు వెనక కాళ్లతో సింహాలను బలంగా తన్నింది. తనను చంపడం అంత ఈజీ కాదనే సందేశాన్ని ఇచ్చింది. దీంతో నివ్వెరపోయిన సింహాలు దూరం జరిగి అరుస్తూ.. మరోసారి దాడికి యత్నించాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది వీడియోలో లేదు. ఈ వీడియో కు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. చివరకు ఏమైంది ? జిరాఫీని సింహాలు చంపాయా? తోకముడిచి పరారయ్యాయా? అనేది తెలిస్తే బాగుండేది అని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.