Viral Kiss Of Lions: వామ్మో ఈ సింహాలు ఏం చేసాయో చూశారా? మహిళకు ముద్దులు, హగ్గులు.. కారణం?

అడవికి రాజు సింహం.. అడవిలో దాని ముందు ఏ ఇతర జంతువులు కూడా నిలబడలేవు. అందుకే సింహాన్ని అడవికి

Published By: HashtagU Telugu Desk
Lions

Lions

అడవికి రాజు సింహం.. అడవిలో దాని ముందు ఏ ఇతర జంతువులు కూడా నిలబడలేవు. అందుకే సింహాన్ని అడవికి రాజు అని కూడా అంటారు. సాధారణంగా మనం ఏదైనా జూకి వెళ్లినప్పుడు సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో హడలిపోతాం. అటువంటిది దగ్గర నుంచి చూస్తే ఇక అంతే సంగతులు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియోలో మాత్రం ఏకంగా రెండు సింహాలు మహిళను ప్రేమగా హత్తుకోవడమే కాకుండా ముద్దులు కూడా పెట్టాయి. సింహాలు మహిళకు ముద్దు పెట్టి హత్తుకోవడం ఏంటా అనుకుంటున్నారా! మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకీ వెళితే.

స్విట్జర్లాండ్‌లోని ఓ జూలో ఉండే రెండు సింహాలు తన యజమానిని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని మహిళ 7 సంవత్సరాల క్రితం రెండు సింహాలను పెంచింది. వాటిని ప్రతిరోజు ఎంతో అపురూపంగా చూసుకునేది. రెండు సింహాలతో ఆటలు కూడా ఆదుకునేది. అయితే సింహాలు ఇంట్లో ఉండడం ప్రమాదకరం అని జూ సిబ్బంది వాటిని తీసుకెళ్లారట. ఆ తరువాత 7 సంవత్సరాల తర్వాత ఆ మహిళ జూను సందర్శించడానికి వెళ్లగా అప్పుడు ఆ రెండు సింహాలు ఉండే చోటుకు ఆమె వెళ్లగానే అవి తన యజమానిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చాయి.

 

సెక్యూరిటీ కంచె పై నుంచే మహిళను తమ ముందు కాళ్లతో హత్తుకుని తమ ప్రేమను చూపించాయి. అందులో ఓ సింహం అయితే తన యజమానిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టింది. రెండు ఒకేసారి ఆమె మీద పడినా వాటి బరువును మోస్తూ సంతోషం వ్యక్తం చేసింది ఆ మహిళ. కాగా ఇందుకు కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  Last Updated: 26 Aug 2022, 12:45 PM IST