సింహంతో ఆటలా ? బోనులో ఉన్నంత మాత్రాన సింహం సింహం కాకుండా పోతుందా ? జూ పార్కుకు వెళ్లిన ఓ వ్యక్తి సింహాన్ని కెలికాడు. దాన్ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు.
కవ్వించేందుకు తీవ్రంగా యత్నించాడు. సింహం నోట్లో కి పదేపదే వేళ్ళు పెట్టి మరీ వెకిలి చేష్టలు చేశాడు. దీంతో ఆగ్రహించిన సింహం.. వేలును నోట్లో పట్టేసింది. కాసేపటి వరకు .. తన వేలును సింహం నోటి నుంచి బయటికి తీసేందుకు సర్వ ప్రయత్నాలు చేశాడు. ఎంత ఊగిపోయినా.. సింహం నోట్లో నుంచి వేలు మాత్రం బయటికి తీయలేకపోయాడు.
చివరకు సింహం ఆ వేలిని కొరికి, లాగేసింది. దీంతో అతడు వేలిని కోల్పోయి , వెనుక వైపు కుప్పకూలాడు. అయితే.. ఇటువంటి పరిస్థితుల్లో అతడిని రక్షించాల్సిన వాళ్ళు, సెల్ ఫోన్ కెమెరాలతో వీడియో తీయడం గమనార్హం. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ బాగా స్పందించారు.
‘ జూ లకు వెళ్ళినప్పుడు వెకిలి చేష్టలు చేయొద్దు. జంతువుల సహనాన్ని పరీక్షించొద్దు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఈ వీడియోను తీయడం ఆపేసి, అక్కడున్న అందరూ కలిసి అతడిని వెనక్కి లాగి ఉంటే వేలు పోకుండా ఉండేది’ అని ఇంకొకరు పేర్కొన్నారు. ‘ సింహాన్ని కెలికి వేలు పోగొట్టుకున్న మూర్ఖుడి కంటే.. వీడియో తీసిన వెధవల వల్ల సమాజానికి ఎక్కువ ముప్పు ఉంది’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Morris Monye (@Morris_Monye) May 22, 2022