LinkedIn New Feature: లింక్డ్ ఇన్ నుండి సరికొత్త ఫీచర్..వారికోసం ఫ్లాట్ ఫాంలో మార్పులు..!!!

ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ ఇన్...ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది.

  • Written By:
  • Publish Date - February 25, 2022 / 06:40 AM IST

ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్డ్ ఇన్…ప్రస్తుతం అందిస్తున్న సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. గ్లోబర్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్లు ఈ సంస్థ లేటెస్టుగా తెలిపింది. ఇండియాలోనూ పలు రంగాల్లో క్రియేటర్స్ మరింతగా రాణించేందుకు ఇది ప్రోత్సాహకంగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. క్రియేటర్లు తమ కంటెంట్, కమ్యూనిటీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు, ప్రొడక్టివ్ కన్వర్జేషన్స్ కోసం…సరైన ఛాన్స్ కోసం క్రియేటర్లను కనెక్ట్ చేయడం లాంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ ప్రోగ్రామ్ ను ప్రారంభించినట్లు లింక్డ్ ఇన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా సెలక్ట్ చేసిన 200 మంది క్రియేటర్లు లింక్డ్ ఇన్ కమ్యూనిటీ మేనేజ్ మెంట్ టీం సపోర్ట్ ద్వారా యాక్సెస్ పొందుతారు.

ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు, క్రియేటర్లు టు క్రియేటర్ నెట్ వర్కింగ్ అవకాశాలు, రిచ్ టూల్స్ , రిసోర్స్ యాక్సెస్ పై టీమ్ లీడర్లు అంకూర్ వారికో, రాధిక గుప్తా, పూజా దింగరా, నాసిర్ యాసిన్ ఆధ్వర్యంలో క్రియేటర్లకు అవగాహన కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన క్రియేటర్ల ఆలోచనలకు పదును పెట్టేందుకు వారిలో దాగి ఉన్న క్రియేటివిటిని బయటకు తీసేందుకు వారికి ఆర్థికంగా గ్రాంట్ కూడా ఇవ్వనున్నారు. ఇది వారికి ప్రోత్సాహకంగా పనిచేయనుంది.

ఇక గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కోసం విభిన్న నేపథ్యం, అనుభం, నైపుణ్యం ఉన్న క్రియేటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే న్యూస్, వీడియో, షార్ట్ ఫార్మ్ పోస్టులు వంటి అంశాలపై లింక్డ్ ఇన్ టూల్స్ ను ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు హిందీ లాంగ్వేజ్ క్రియేటర్లు కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చి 16 వరకు అప్లికేషన్స్ పంపించవచ్చు. సెలక్ట్ అయిన క్రియేటర్ల జాబితాను ఇంకొన్ని నెలల్లో ప్రకటిస్తారు.

లైవ్ టెలికాస్ట్ జరగనున్న కార్యక్రమాన్ని లింక్డ్ ఇన్ కమ్యూనిటీ మేనేజ్ మెంట్ గ్రూప్ లీడ్ చేయనుంది. ఈ ఈవెంట్ భారత కాలమాన ప్రకారం మార్చి 2న ఉదయం 11.30 గంటలకు లింక్డ్ ఇన్ పేజీలో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఈ ప్రోగ్రామ్ ను తొలిసారి గత ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో విజయవంతంగా ప్రారంభించారు. తర్వాత మళ్లీ ఇప్పుడు భారత్ లో నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా లింక్డిన్ యుఎస్డి 25మిలియన్ల క్రియేటర్లను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతోనే క్రియేటర్ యాక్సిలేటర్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు.

ఇదే విషయంపై లింక్డ్ ఇన్ ఇండియా మేనేజర్ అశుతోష్ గుప్తా స్పందించారు. సరైన వనరుల నుంచి విభిన్న శ్రేణుల్లో క్రియేటర్లను సిద్దం చేయడం, వారి కంటెంట్ సంభాషణలతో గొప్ప వ్యాపార అవకాశాలను పొందడమే గ్లోబల్ క్రియేటర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ లక్ష్యమని వివరించారు.