Site icon HashtagU Telugu

UIDAI Update: ఆధార్ తో మొబైల్ నంబరు లింక్ చేశారా ? ఇలా తెలుసుకోండి..

Uidai Update Linked Mobile Number With Aadhaar.. Know This..

Uidai Update Linked Mobile Number With Aadhaar.. Know This..

మీ ఆధార్‌ కార్డు నంబర్ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా “mAadhaar” యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్’ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్‌ తో మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? అనేది తెలుసుకోవచ్చు.

ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఇప్పటికే ఆధార్‌ నంబర్ తో అటాచ్ అయి ఉంటే UIDAI వెబ్‌సైట్ స్క్రీన్‌పై.. ‘మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది’ అనే మెసేజ్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఒకవేళ నిర్దిష్ట మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలు మీ ఆధార్ కు లింక్ చేసి లేకుంటే.. వాటిని లింక్ చేయడానికి ఏం చేయాలి అనేది కూడా తెలియజేస్తుంది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఒకవేళ మొబైల్ నంబర్ గుర్తుకు రాకపోతే.. మై ఆధార్ పోర్టల్ లేదా mAadhaar యాప్‌లోని వేరిఫై ఆధార్ ఫీచర్‌ లోకి వెళ్లి ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ లోని చివరి మూడు అంకెలను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పటివరకు ఆధార్ తో మొబైల్ నంబర్ లింక్ అయి లేకుంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.

మీ ఫోన్‌ నంబర్ ను అప్‌డేట్ ఇలా..

  1. తొలుత uidai.gov.inలోకి వెళ్లి ‘లోకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని ఐడెంటిఫై చేయండి.
  2. అనంతరం ఆ ఆధార్ కార్డ్ సెంటర్‌కు వెళ్లండి.
  3. మొబైల్ నంబర్‌ని మార్చడానికి లేదా అప్‌డేట్ చేయడానికి మీకు ఒక ఫారమ్ ఇస్తారు. దాన్ని నింపండి.
  4. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి.. మరోసారి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.
  5. అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ అంటే URN. మీకు URN స్లిప్‌ను ఇస్తారు. ఇందుకోసం రూ.50 తీసుకుంటారు.
  6. URN ద్వారా మీ ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in కి వెళ్లి.. చెక్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.
  7. URN నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. 90 రోజుల్లోగా UIDAI డేటాబేస్‌లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.

Also Read:  Business Ideas: ఈ సమ్మర్ లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా.. ఈ వ్యాపారం చేస్తే రోజుకి 6000 రూపాయల లాభం..!