Site icon HashtagU Telugu

Kodali Nani: వానర సైన్యం మాదిరి.. రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి: కొడాలి నాని

Kodali Nani

Kodali Nani

Kodali Nani:  ఏపీలో నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. 34,50000 నగదును, పురస్కారాలు ఎమ్మెల్యే కొడాలి నాని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 5మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున రూ.75వేల వ్యక్తిగత నగదును ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోత్సాహంగా ప్రకటించారు.

ప్రజలపై మమకారంతో స్వచ్ఛందంగా గౌరవ వేతనంతో పని చేస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే నాని కొనియాడారు. ఎటువంటి వివక్షత చూపకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. కుటుంబ సభ్యుడు మాదిరి ప్రజలకు సహాయం చేస్తున్న వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు.

వానర సైన్యాన్ని చూసి లంకాధిపతి రావణుడు ఎలా వణికి పోయాడో… రాజకీయ రావణాసురుడు చంద్రబాబు అనుకో బ్యాచ్ వాలంటీర్లను చూస్తే అలాగే వణికి పోతున్నారన్నారు. ప్రజలకు అన్యాయం చేసే రాజకీయ రావణాసురుడిని, వానర సైన్యం మాదిరి వాలంటీర్లు తరిమికొట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందో, వాలంటీర్లు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లతో అతి త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

Exit mobile version